Monday, 2 November 2026

దీక్ష విరమణకు పాదయాత్రగా బయలుదేరిన భక్తులు.

నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి )
హనుమాన్ దీక్ష విరమణకు శుక్రవారం నెన్నెల మండల కేంద్రానికి చెందిన హనుమాన్ దీక్షా పరులు పాదయాత్రగా బయలుదేరారు. 11, 21 రోజులు కఠిన నియమ నిష్టలతో దీక్ష స్వీకరించిన భక్తులు హనుమాన్ నామస్మరణతో పూజలు చేసి దీక్ష విరమణ సమయం ఆసన్నం కావడంతో అదే భక్తి భావంతో పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్న భక్తులు మండల కేంద్రంలోని భక్తంజనేయ స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలు పెట్టారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా పాదయాత్ర సాఫిగా సాగాలని వేడుకున్నారు.