Monday, 2 November 2026

మహిళా జీవనోపాదుల కల్పనలో జిల్లా మెప్మా విభాగంకు ప్రథమ స్థానం

మహిళా జీవనోపాదుల కల్పనలో జిల్లా మెప్మా విభాగంకు ప్రథమ స్థానంసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి జీవనోపాధిలనుమెరుగుపరుచుకొనుటకు పలు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ సంస్థ ద్వారా జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంఘాల మహిళలకు అధిక మొత్తంలో రుణాలు అందించినందున సూర్యాపేట జిల్లా మెప్మా విభాగం రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించినట్లు జిల్లా మెప్మా అధికారి రమేష్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన స్త్రీ నిధి రాష్ట్రస్థాయి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నుండి అవార్డును అందుకున్నట్లు తెలిపారు.ఈ అంశంలో సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీ లలో అధిక మొత్తంలో రుణాల పంపిణీ చేయడం, నిరార్థక బకాయిలు లేకుండా చూడడం వలన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు.