కాంగ్రెస్ తరహా రాజకీయాల్లో ఆరితేరిన మోడీ
గత తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్
గద్దెనెక్కిన యెడ్యూరప్ప గట్టెక్కే మార్గమెలా అన్న ఉత్కంఠలో ప్రజలు
న్యూఢిల్లీ,మే18(జనం సాక్షి ): బడిత ఉన్నవాడిదే బర్రె..అన్న సామెతను కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రుజువు చేస్తోంది. రాష్ట్రానికో రాజకీయన్యాయ సూత్రాన్ని పాటిస్తోంది. ఏ రాష్ట్రానికి ఏది అవసరమో ఆ సూత్రాన్ని విశ్లేషిస్తోంది. గోవాలో జరిగిన తీరుకు..కర్నాటకలో జరిగిన తీరుకు పొంతన లేకున్నా మోడీ రాజ్యాంగంలో ఈ రెండూ సరైనవే. ఇకపోతే ఇలాంటి చెడుగుడు ఆటలు గతంలో కాంగ్రెస్ అనేకం ఆడింది. దేవానికి అనైతిక రాజకీయాలు నేర్పిన కాంగ్రెస్..ప్రస్తుతం ఇలాంటి అనైతిక రాజకీయాలను చూస్తే తట్టుకోలేకపోతున్నది. నిజానికి కర్నాటకలో తనకు బలం లేనప్పుడు తనకు సంబంధం లేని జెడిఎస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వాలి. వారేమైనా వచ్చి అడిగారా? లేకపోతే తముకున్న సీట్లలో తక్కువ సీట్లున్న దేవేగౌడ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి. గతంలో ప్రధానిగా దేవేగౌడకు మద్దతి ఇచ్చి ఎందుకు ఉపసంహరించుకున్నారు..ఇవన్నీ చరిత్ర. వీటిని మర్చి పోయి మాట్లాడడం మంచిది కాదు. కర్నాటకలో బిజెపి అనైతికతకు పాల్పడిందని అనడం ద్వారా కాంగ్రెస్ గత తప్పిదాలను కప్పిపుచ్చుకోలేదు. అయితే అధికారంలో ఉన్నది మోడీ కనుక దేశంలో ఆయన తనకు అనుకూల రాజకీయాలనే నడుపుకుంటున్నారు. కాంగ్రెస్ చరిత్ర పుటలనే ఆయనా చదువుకున్నారనిపిస్తోంది. ఒకవైపు సుప్రీంకోర్టు అరుదైన రీతిలో అర్థరాత్రి ఇచ్చిన ఆదేశాల ఆసరా.. మరోవైపు విపక్షాల విమర్శలు, నిరసనల ¬రు… వీటి నడుమ.. గురువారం ఉదయం భాజపా నేత యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా నిరాడంబరంగా ప్రమాణం చేశారు. సభలో బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చినా తమకు అంత సమయం అవసరం లేదని, ఈలోపే నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పైగా నేను మొత్తం 224 మంది మద్దతూ కోరతా.. విూరంతా ఆత్మసాక్షి ప్రకారమే ఓటేయండని పిలుపూ ఇచ్చారు. భాజపా 104 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా.. సాధారణ మెజారిటీకి మరో 8 మంది శాసనసభ్యులు తక్కువున్నారు. ఈ మద్దతు ఎక్కడి నుంచి తెస్తారన్నదే ఇప్పుడు కన్నడ సీమలో ఉత్కంఠభరిత రాజకీయాలకు, రకరకాల ఊహా గానాలకు తెర తీస్తోంది. నిజానికి కాంగ్రెస్, జేడీఎస్‌లకు సంపూర్ళణ మెజార్టీ ఉంది. వారంతా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించి కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే వీరిలో ఇప్పటికే ఒకరిద్దరి ఆచూకీ తెలియరాకపోవటం ఆ పార్టీలకు కునుకులేకుండా చేస్తోంది. కొందరు లోపాయ కారీ మద్దతు ఇస్తున్నారని సమాచారం. దీనికితోడు ఇడి కేసులు వెన్నాడుతున్న వారు వాటినుంచి బయట పడే మార్గాలను ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పరిచేందుకు బేరసారాలు జోరందుకున్నాయి. దీనికి సంబంధించిన ఆడియో టేపులు కూడా విూడియాలో హల్చల్ చేస్తున్నాయి. యడ్యూరప్ప అధికార పీఠాన్ని ఎక్కుతూనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకున్న భద్రతాసిబ్బందిని తొలగించి.. ప్రతీకార రాజకీయాలను మొదలెట్టేశారు. సంఖ్యాబలానికి సంబంధించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలేవో తమకు సమర్పిం చాలనీ సుప్రీం ఆదేశించినా ఎక్కడి నుంచి బలం వస్తుందో తెలియడం లేదు.మొత్తంగా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో జట్టు కట్టినా, సుప్రీం తలుపు తట్టినా బిజెపి అధికార పీఠం ఎక్కకుండా అడ్డుకోలేకపోయింది. మెజారిటీ ఉన్నా తమకు మొండిచెయ్యి చూపించి.. ఇంత చేసిన తర్వాత మేమెలా ఊరుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ గోవా, మిజోరాం, మేఘాలయ వ్యవహారాలనూ తిరగదోడుతోంది. ఆయా రాష్టాల్లోన్రూ ఇదే అతిపెద్ద పార్టీ సంప్రదాయాన్ని పాటిస్తూ తమకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్ తలుపులు తడుతోంది. అదను దొరికింది కదా అని బిహార్‌లోని ఆర్జేడీ కూడా ఇదే పాట అందుకోవటం కొసమెరుపు! నిజానికి బీజేపీ విజయంలో బీఎస్ యెడ్యూరప్ప, శ్రీరాములు ఇద్దరూ ముఖ్యభూమిక పోషించినా ఓ ఎనిమిది ఈట్లను సంపాదించడంలో విఫలం అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వేరుపడి సొంతకుంపట్లతో పార్టీని దెబ్బ కొట్టిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు కీలకంగా వ్యవహరించటం విశేషం. 2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన యెడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు స్థాపించుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఆ ఇద్దరు నేతలే బీజేపీ ఓటు శాతం పెరిగేందుకు సాయపడ్డారు. ముఖ్యంగా తమ తమ సామాజిక వర్గాల ఓట్లతోపాటు, తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ఈ ఇద్దరు దోహదపడ్డారు. లింగాయత్ వర్గానికి సిద్ధరామయ్య ఇచ్చిన హావిూని అంతగా పట్టించుకోని ప్రజలు, యెడ్డీ వైపే మొగ్గు చూపగా, మైనార్టీలు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలు కావటం గమనార్హం. మొత్తంగా ఇప్పుడు యెడ్యూరప్ప గద్దెను ఎక్కినా ఎలా గట్టెక్కుతారన్నదే సర్వత్రా ఉత్కంఠగా మారింది.




