Thursday, 5 November 2026

దుమ్ము…రేగుతుంది రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు అన్నంలో నీళ్లలో దుమ్

దుమ్ము…రేగుతుంది రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు అన్నంలో నీళ్లలో దుమ్మే
జనం సాక్షి ( సిరిసిల్ల టౌన్) సిరిసిల్ల పట్టణం 12వ వార్డు చంద్రంపేటలో ప్రధాన రహదారిపై గ్రామం నడిబొడ్డులో సిసి రోడ్డు చెడిపోయి సంవత్సరాలు గడుస్తుంది దీనిపై కంకర తేలడంతో మట్టి పోశారు రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు ఈ రోడ్డు గుండా నిత్యం వెళుతుంటాయి దీంతో దుమ్ము రేగి చంద్రంపేట్ లోని రోడ్డు ఇరువైపులా ఉన్న ఇళ్లలోకి విపరీతంగా దుమ్ము చేరి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇండ్లపైన ఇంట్లో బట్టల పైన అన్నం లో నీళ్లలో దుమ్ము పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులకు చిన్న పిల్లలకు దుమ్ముతో దగ్గు జలుబు వచ్చి ఊపిరితిత్తులు చెడిపోతున్నాయని ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోగా ఎవరికైనా చెప్పుకోండి నేనేం చేస్తానని సమాధానం చెబుతున్నాడని తెలిపారు ప్రొద్దున సాయంత్రం రెండుసార్లు ట్యాంకర్ నీళ్లతో దుమ్ము లేపకుండా నీళ్లు పట్టించాల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు