దుర్గా కంపెనీ ఆవరణలో సామూహిక జాతీయ గీతాలాపన
పినపాక నియోజకవర్గం ఆగష్టు 16 (జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వతంత్ర భారత ద్విసప్తహా వజ్రోత్సవ సామూహిక జాతీయ వేడుకలలో భాగంగా పీకే ఓ సి ఫోర్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతి గౌడ్ ఆదేశాల మేరకు దుర్గా కంపెనీ మేనేజర్ పుచ్చకాయల రవిశంకర్ సింగరేణి అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11:30 ని,,లకు కార్మికులచే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సంధర్బంగా రవి శంకర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ ఎంతో మంది మహనీయుల త్యాగాలను స్మరించుకునే బాధ్యత మనపై ఉంది. మనమంతా మాతృభూమికి మనవంతు సేవా చేయాలన్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరం అన్ని రంగాల్లో బలమైన శక్తిగా భారతదేశం ఏర్పడిందని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించు కోవాలన్నారు. కార్యక్రమంలో దుర్గా కంపెనీ యాజమాన్యం సింగరేణి అధికారులు, కార్యాలయ సిబ్బంది నగేష్ పణి కుమార్ ,శ్రవణ్ కుమార్ ,ఎంవిటిసి శ్రీకాంత్, సైట్ సూపర్వైజర్లు, సాని డంపర్ ఆపరేటర్లు ,వోల్వా డ్రైవర్లు, గ్రేడర్, డోజర్ ,షావల్ ఆపరేటర్లు, గ్యారేజీ కార్మికులు ,ట్రిప్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు