Tuesday, 3 November 2026

దేవరుప్పుల మండల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక

దేవరుప్పుల మండల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక..

దేవరుప్పుల, డిసెంబర్ 30(జనం సాక్షి):డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను దేవరుప్పుల మండల ప్రజలంతా ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని డిసెంబర్ 31 ఉదయం నుండి అర్ధరాత్రి ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని,ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం, కంటపడితే జైల్ పాలు కావడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ , నిర్వహిస్తామని
కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మస్కులను ధరించి,సామాజిక దూరం పాటించాలని
అతిగా మద్యం సేవించి ఘర్షణలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానాలు,కఠిన చర్యలు తప్పవని,కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని
ఒక్క రోజు ఆనందం కోసం మీ ప్రాణాలను,మిమ్మలి నమ్ముకొని ఉన్న మీ కుటుంబ సభ్యుల,ఆనందాలను ఆశాలను నిరాశాలుగా మార్చుకోవద్దు అన్నారు.
పర్మిషన్ లేకుండా సమయ పాలన లేకుండా డిజె సౌండ్స్,వాడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.సమయపాలన పాటించి,సక్రమంగా ఉండాలని,సమస్యలను కొని తెచ్చుకోవద్దు అంటూ ఎస్సై రమేష్ అన్నారు.