Tuesday, 3 November 2026

దేవర యంజాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణి చేసిన ధాత

శామీర్ పేట్, జనంసాక్షి :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరయంజాల్ యందు మంగళవారం రోజు నాగిరెడ్డి వెంకట రంగారెడ్డి దంపతులు పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు అందజేశారు. వారు గత 12 సంవత్సరముల నుండి ఈ విధంగా విద్యార్థులకు ఉచితంగా ప్రతి విద్యార్థికి ఏడు నోటు పుస్తకములు ఇస్తున్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి స్వరూప రాణి మరియు ఉపాధ్యాయులు వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
27ఎస్పీటీ -1: నోటు పుస్తకాలు పంపిణి చేస్తున్న దృశ్యం