ఝరాసంగం జూన్ 27( జనం సాక్షి) మండల కేంద్రంలో ప్రాథమికోన్నత పాఠశాల ఝరా సంగం లో విద్యార్థులకు పలకలు విద్య సామగ్రి ని పంపిణీ చేశారు. మంగళవారం ఎల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఎల్పింగ్ హాండ్స్ ఛైర్మన్ మొరంగి పల్లి జైపాల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నయ్య చేతుల మీదుగా విద్యార్థుల కు అందజేశారు. . సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విదంగా నడుచుకోవలన్నారు.ఎల్పింగ్ హ్యాండ్ సంస్థ చేస్తున్న సేవ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ రాయికోటి నర్సింలు సభ్యులు మోహన్ ఉపాధ్యాయులు తుక్కప్ప సంగీత,సంతోష్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
విద్యార్థుల కు పలకలు విద్య సామాగ్రి పంపిణీ




