Tuesday, 3 November 2026

దేవాలయానికి విరాళన్ని అందించిన  దాత

పెన్ పహాడ్ మే 01(జనం సాక్షి) :మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దుర్గ మహేశ్వర దేవాలయ నిర్మాణంలో భాగంగా మునగాల మండలం విజయరాఘవపురం వాస్తవ్యులైన సోమపంగు సైదులు ధర్మపత్ని సుధా దంపతులు వారి కుమార్తెలు అఖిల, ఐశ్వర్యలు సోమవారం దేవాలయాల నిర్మాణానికి లక్ష రూపాయల విరలాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారని సర్పంచ్, దేవాలయాల నిర్మాణ కర్త బిట్టు నాగేశ్వరరావు అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడ మొదటి విడుతగా గ్రామానికి విచ్చేసి రూ.50116/- విరాళంగా ఇవ్వడం జరిగిందని తరువాత మళ్లీ దేవాలయానికి ఆర్థిక వనరులు లేక చాలా ఇబ్బంది అవుతున్నదని భావించిన సోమపొంగు సైదులు గారు ఉదార భావంతో గొప్ప ఔదార్యాన్ని ప్రదర్శించి రెండవసారి అక్షరాల ఒక లక్ష రూపాయలను విరాళంగా అందించారని తెలిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారి కుటుంబం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగిందని అంతేకాక వారికి దేవాలయ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎల్లప్పుడూ వారి కుటుంబానికి మంచి జరగాలని ఆ భగవంతుని కృపా కటాక్షం వారికి కొరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల సోమయ్య, కత్తి ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు…