సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఆ పార్టీ కార్యాలయం ఎంబీ భవన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. దేవీప్రసాద్ అభ్యర్థిత్వంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వీరభద్రం తెలిపారు. అందుకే, దేవీప్రసాద్ కు వ్యతిరేకంగా అభ్యర్ధిని నిలపలేదన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే విషయం పార్టీ నేతలతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
దేవీప్రసాద్ అభ్యర్ధిత్వంపై అభ్యంతరం లేదు




