“దేవుని గుడి నిర్మాణానికి దాతల సహకారం అభినందనీయం”
పెన్ పహాడ్ జనవరి 14 (జనం సాక్షి) :
దేవుని గుడి నిర్మాణానికి దాతల సహకారం అభినందనీయమని దూపహాడ్ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు అన్నారు మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి దుర్గ మహేశ్వర దేవాలయ నిర్మాణంలో భాగంగా శనివారం జల్మాల్ కుంట తండా వాస్తవ్యులు ధరావత్ ట్టాక్రియ వారి ధర్మపత్ని గుజిరి దంపతులు 5016/- విరాలాన్ని అందజేయగా స్వీకరించి మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మిస్తున్న దేవాలయానికి ప్రతి ఒక్కరు సహాయాన్ని అందించాలని దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు దేవాలయ కమిటీ వారు దాతల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భగవంతుని కృప వారికి లభించాలని కోరుకుంటూనమన్నారు ఈ కార్యక్రమంలో అర్థి కేశవులు, బిట్టు కోటయ్య, దొంగరి నాగయ్య, గ్రామ భక్తమండలి చైర్మన్ కీత సరోజనమ్మ, తదితరులు పాల్గొన్నారు




