Thursday, 5 November 2026

రుద్రంగిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

రుద్రంగిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

 

రుద్రంగి జనవరి 15 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మండలంలోని మహిళలు సంక్రాంతి సందర్భంగా వారివారి ఇండ్ల ముందు సంక్రాంతి ముగ్గులను వేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా మహిళలు ఆనందోత్సవాల మధ్య ఇంటి వాకిళ్లలో రంగవల్లి ముగ్గులను వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.ఈ సంవత్సరం కూడా మండల ప్రజలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.