Wednesday, 4 November 2026

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: జేసీ దివాకర్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు తప్పవని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి శనివారం అభిప్రాయపడ్డారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పీఎం కిరణ్‌ను ఆయన శనివారం కలిశారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదే విషయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌కు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *