రాజన్న సిరిసిల్లబ్యూరో. ఏప్రిల్ 14. (జనం సాక్షి.).భారత దేశానికి భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమని 17వ పెట్టాలి కమాండెంట్ కె.సుబ్రమణ్యం అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమాండెంట్ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ బి.ఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయవేత్త, న్యాయవాది, ఆర్థికవేత్త , సంఘ సంస్కర్త అని అంబేద్కర్ అన్యాయంపై పోరాటంలో భాగంగా అంటరాని వారి పక్షాన నిలిచిన మహనీయుడని అన్నారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ యమ్. పార్థసారథి రెడ్డి గారు,బెటాలియన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




