వరంగల్ ఈస్ట్ ఏప్రిల్ 14 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 42వ డివిజన్లోని రంగసాయిపేట ఎస్సీ కాలనీలో బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షు మత్స్య సుధాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగినాయి. ఇట్టి కార్యక్రమంలో రాముల వారి గుడి ధర్మకర్త మచ్చ కవిత హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసినారు ఆయన దేశానికి చేసిన సేవలు మరిచిపోరాదని ఆమె అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఈ అనసూర్య ఆయా వరలక్ష్మి బిఆర్ఎస్ కార్యకర్తలు మచ్చ కోటేశ్వర్ మచ్చ శ్యామ్ మచ్చసాంబయ్య మచ్చ సురేష్ చాగంటి విజయ్ రుద్రారపు నవీన్ చాగంటి రాజు సుధాకర్ పాల్గొన్నారు




