దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని
ఎమ్మెల్యే మదన్ రెడ్డి జనం సాక్షి /కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఆశ వర్కర్లు అంగన్వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు నాణ్యమైన అద్దాలు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, ఎంపీడీవో గణేష్ రెడ్డి, కోనాపూర్ సర్పంచ్ రమేష్. సంతోష్ రావు .ఏటిగడ్డ మాదాపూర్ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి .తదితరులు పాల్గొన్నారు




