Wednesday, 4 November 2026

దేశ అభివృద్ధికి సూచికలు తెలంగాణ పల్లెలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ మార్చి 24 జనం సాక్షి
దేశ అభివృద్ధికి సూచికలుగా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు నిలుస్తున్నాయని వికారాబాద్ జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులు పురస్కారం* కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్*తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలతో తెలంగాణ పల్లెలు ప్రగతిరథంలో ముందుకు దూసుకెళ్తున్నాయన్నారు.
ఒక మండలంలోనే ఇన్ని అవార్డులు రావడానికి నిర్విరామంగా కృషి చేసిన ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందిస్తూ… అవార్డులు ప్రధానం చేస్తూ… సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ కమల్ రెడ్డి ఎంపీడీవో సత్తయ్య ఎంపీ ఓ నాగరాజు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.