Wednesday, 4 November 2026

దేశ సమగ్రత కోసమే కమ్యూనిస్టుల పోరాటాలు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కలవేని శంకర్

 

 

 

 

 

 

(ప్రత్యేక ప్రతినిధి / జనంసాక్షి )కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకే సీపీఐ పోరాడుతుందని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కలవేని శంకర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజల మధ్య విష బీజాలు నాటి మతోన్నాడ విద్వేషాలకు తెరలేపుతుం దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా స్వార్థ పాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, సింగరేణి ప్రైవేటీకరణతో పాటు అనేక ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి, పోడు భూమ ఎలకు పట్టాలు పారదర్శకంగా వచ్చేంత వరకు సీపీఐ తరుపున దశల వారీగా పోరాటాలు: చేస్తామన్నారు. ఎర్రజెండాను భుజానెత్తిన పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిం దని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటాలు చేస్తుందన్నారు. ఇందుకు ప్రజలందరు కలిసి రావాలన్నారు. అనంతరం కొత్తగూడెంలో జూన్ 4న నిర్వహిం

చతలపెట్టిన ప్రజా గర్జన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి: నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు హాజరవుతారని, నాయకులు, కార్మికులు, ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలీండర్అలీఖాన్, రాష్ట్ర సమితి సభ్యుడు మేకల దాసు, జోగుల మల్లయ్యదేవి. పోచన్న, రాజేశ్వర్రావు, లక్ష్మణ్, మహేందర్రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, శంకరయ్య, రవీందర్, రాజేశం, యాదగిరి, నర్సయ్య, రాజేశం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..