శివ్వంపేట జూన్ 14 జనంసాక్షి : దైవచింతనతోనే ప్రతి మనిషికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బిజిలిపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వాహకుల ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వ దేవత విగ్రహ, యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి అలాగే బుధవారం జరిగిన విగ్రహా, యంత్ర ప్రతిష్ట పూజాది హోమాలకు ఎమ్మెల్యే బీ ఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో కొలువైన పలు దేవత మూర్తుల నూతన విగ్రహాలను దర్శించుకుని అ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ధూప దీప నైవేద్యానికి నోచుకోని ఎన్నో దేవాలయాలను ప్రభుత్వం గుర్తించి ఆ దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. అదేవిధంగా సరైన వేతనాలు లేక వేదనకు గురవుతున్న అర్చకులను గుర్తించి, వారిని కూడా అక్కున చేర్చుకొని నేడు వారికి గౌరవప్రదమైన వేతనాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్నాను. ప్రతి గుడి ధూప, దీప, నైవేద్యాలకు నోచుకునే విధంగా కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చడం జరిగిందని వేల కోట్లతో నూతన అత్యంత శోభాయ మనంగా దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. వేములవాడ రాజన్నకు, భద్రాచలం సీతారాములకు, బాసర సరస్వతి మాతకు, కొమురవెల్లి మల్లికార్జున దేవాలయాలకు ప్రభుత్వపరంగా నిధులు కేటాయించి ఆ దేవాలయాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరిగిందనీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ పూజారి కతృవులలో ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కల్లూరి హరిక
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి




