Wednesday, 4 November 2026

ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళా మృతి.

దౌల్తాబాద్ జూన్ 14, జనం సాక్షి.ద్విచక్ర వాహనం అదుపుతప్పి  వాహనం మీద నుండి క్రిందపడి మహిళ  మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల్ గ్రామానికి చెందిన రోడ్డ నాగరాణి 25 భర్త రామకృష్ణ లు కలిసి మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్ణంపల్లి ఎల్లమ్మ దేవాలయం వద్దకు టీఎస్ 36 ఏ 69 30 గల ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మృతురాలు తన 15 మాసాల గిరిస్కు పాలిస్తున్న తరుణంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి మృతి మృతి చెందినట్లు  మృతురాలు తండ్రి బైరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కొరకై గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు తెలిపారు.