హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ దొంగల పార్టీ అని అధికార పార్టీ అని అభివర్ణించారు. టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం టీడీపీపై విమర్‌శలు గుప్పించడంతో పయ్యావుల కేశవ్ సభలో ఆవేశంగా ప్రసంగించారు. కళంకిత మంత్రులు, సీఎంపై ఆయన నిప్పులు చెరిగారు. దొంగల బండికి సీఎం కిరణ్ సారథిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను సీఎం వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. వివాదస్పద 26 జీవోల కేసులో మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది మొదట టీడీపీనే అని గుర్తు చేశారు. మరో ముగ్గురు మంత్రులు త్వరలోనే జైలుకు వెళ్లారని తెలిపారు. చంద్రబాబుపై విజయమ్మ చేసిన ఆరోపణలను దేశ అత్యన్నత న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులే తేల్చాయని చెప్పారు. తాము ఎప్పటికైనా నిర్ధోషులమే అని పేర్కొన్నారు.




