గవర్నర్‌పేట (విజయవాడ) : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ డిప్యూటీ శాసన మండలి ఛైర్మన్ సిరీస్‌రాజుకు విజయవాడనగర కాంగ్రెస్ ఘన నివాళి అర్పించింది. సిరీస్‌రాజు అంతిమయాత్రలో భాగంగా ఆయన పార్థిన దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ పేటలోని నగర కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అడపా నాగేంద్రం తదితరులు ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. నగర పోలీసులు ఆయనకు గౌరవవందనంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.




