హైదరాబాద్, (మార్చి 10): జంటనగరాల్లో హల్ చల్ చేస్తున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నగర పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు జవహర్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు ఆదిత్య, శేషాద్రి, విజయ్‌ల వద్ద నుంచి రూ.19.5 లక్షల బంగారం, రూ.12 లక్షల వెండి, పదికార్లు స్వాధీనం చేసుకున్నారు.




