హైదరాబాద్: వచ్చేఏడాది మార్చి తర్వాత రాష్ట్రంలో కరెంట్ కోతలుండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన పలు కీలకమైన అంశాలపై సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా కరెంట్ విషయమై సీఎం మాట్లాడుతూ రైతులకు వచ్చే ఏడాది మార్చి నెల తర్వాత ఎలాంటి కష్టాలు పడనీయమని తెలిపారు. ఇకపై రైతన్నలు రాత్రిపూట పొలం కాడికి పోయి మృత్యువాత పడే పరిస్థితి రాదన్నారు. ఇందుకోసం రైతులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ నందిస్తామని స్పష్టం చేశారు. ఇకపై రాత్రిపూట కరెంట్ అందించడమనే మాటే ఉండదని ఉద్ఘాటించారు.





