Tuesday, 3 November 2026

దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి

గద్వాల నడిగడ్డ, జులై 4 (జనం సాక్షి);తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేసిన దొడ్డి కొమరయ్య ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.మంగళవారం దొడ్డి కొమరయ్య 77 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఐ డి ఓ సి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించి తెలంగాణ కొరకు పాటుపడిన దొడ్డి కొమరయ్య ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా చేయడం జరుగుతుందని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనను ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని ప్రశంసించారు. అయన సేవలు స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని అన్నారు.జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జయంతి, వర్దంతి లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటములో అమరుడైన దొడ్డి కొమరయ్య జయంతి ఏప్రిల్ 3, వర్ధంతి జులై 4 లను అధికారికంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో దైర్యంగా ఎదుర్కొని పోరాటం చేసి 1946 జూలై 4 న తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య తెలాంగాణ విప్లవం లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్,ఎస్సి, బి సి సంక్షేమ అధికారి శ్వేత ప్రియదర్శిని ,ఏ ఓ యాదగిరి,సుపరింటేన్దేంట్లు వరలక్ష్మి, రాజు, బి సి వెల్ఫేర్ , కల్లెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.