Tuesday, 3 November 2026

పేదల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ గారు అన్నారు

జనం సాక్షి ప్రతినిధి మెదక్మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలోని 80 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైనరూ.46,40,000/- విలువ చేసే చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. వేలాది మంది మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ గారు అహర్నిషలు కృషి చేస్తున్నారని , వారి బాగోగులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.నియోజకవర్గంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి. జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యం. గంగాధర్,మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి , జయరాజ్,ఆర్కే శ్రీనివాస్, నర్సింగి మండలం వైస్ ఎంపీపీ సుజాత శంకర్, చెల్మెడ,నిజాంపేట్ ఎంపిటిసి లు బాల్రెడ్డి, పప్పుల.లహరి కిష్టారెడ్డి నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్,ప్రభు రెడ్డి, సాంబశివరావు,మ్యాకల. సాయిలు, శివరామకృష్ణ, శ్రీనివాస్,బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, బిఆర్ఎస్వి నవీన్, కసాపురం.కిరణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.