Tuesday, 3 November 2026

దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి ముఖ్య అతిథులుగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 4:–. దొడ్డి కొమురయ్య అనుసరించిన విధానాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం సూచించారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పక్కన ఉన్న మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ప్రాంగణంలో దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , ఎస్సై అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తలు, హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం మాట్లాడుతూ వెట్టి చాకిరి విముక్తి కోసం విష్ణుర్ రామచంద్ర రెడ్డి పెత్తందారితనాన్ని వ్యతిరేకించేందుకు దొడ్డి కొమురయ్య చేసిన సాహసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణుర్ దేశ్ముఖ్ పై పోరాడిన విప్లవ వీరుడు దొడ్డి కొమురెయ్య అని గుర్తు చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా కొందరి కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన వేలాది ఎకరాల భూమిని వారి కబంధాల నుంచి విముక్తి కలిగించి పేదలకు పంచిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని ఆయన ఘన కీర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బిజెపి పార్టీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత, బిఎస్పి అధ్యక్షులు యాక స్వామి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్, ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, డాక్టర్ కే, డాక్టర్ కంది పెంట చారి, రిపోర్టర్ శ్రీనివాస్, బిఎస్పి నాయకులు ఆనంద్, మాజీ ఎంపిటిసి సభ్యులు రంగుల సతీష్ నేత, టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్,ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు రావుల ఐలయ్య, చెన్నపురం వడ్డెరసంగం నాయకులు నరసన్న, శ్రీనాథ్ గుప్తా, చారి పలువురు నాయకులు పత్రికా మిత్రులు తదితరులు పాల్గొన్నారు