Tuesday, 3 November 2026

దొడ్డి కొమురయ్య ఘన నివాళి.

దొడ్డి కొమురయ్య ఘన నివాళి.నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.దొడ్డి కొమురయ్య 96 వ జయంతి సందర్భంగా  మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. దొడ్డి కొముర‌య్య చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.నేటి యువ‌త మ‌హ‌నీయుల‌ను ఆద‌ర్శంగా తీసుకుని ముందుకు సాగాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో, మున్సిపల్  కమీషనర్ వెంకటేశ్వర్లు,మేనేజర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు