Tuesday, 3 November 2026

బలగం సినిమా ప్రదర్శన బోథ్

ధన్నూర్ (బి) లో  (జనంసాక్షి) బోథ్ మండలంలోని ధన్నూర్ (భి) గ్రామం లో ఆదివారం సాయంత్రం బలగం సినిమా ప్రదర్శించారు. బిజెపి గిరిజన మోర్చా అధికార ప్రతినిధి చాకటి దశరథ్ ప్రదర్శనను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చిన్న పెద్ద అందరు కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దశరథ్ మాట్లాడుతూ కుటుంబ సంబంధ బాంధవ్యాలపై సినిమాలో చాలా బాగా వివరించడం జరిగిందని అందుకోసం గ్రామంలో ఈ సినిమాను ప్రదర్శించామన్నారు.