ధర్మపురి మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని, ప్రధానోపాధ్యాయుడు మీడియా తెలిపారు,చిన్నారులు చేసిన చిట్టి ప్రయోగాలు ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ,సోలార్ విద్యుత్ న్యూట్రిషన్ ఫుడ్,తదితర ప్రాజెక్టులు సందర్శకులను అలరించాయి. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించడం కోసం ప్రాథమిక పాఠశాలలో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాశెట్టి రమేష్ ,కే శారద,కే శ్రీనివాస్, ధావన్ పల్లి రమేష్,రజిత మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
దోనూర్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఫెయిర్ సెలబ్రేషన్..




