Monday, 2 November 2026

శాంతాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభంపాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్

బిచ్కుంద ఫిబ్రవరి 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల శాంతాపూర్ గ్రామంలో మంగళవారం నాడు బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతోందని పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ తో పాటు ఎమ్మార్పీఎస్ టీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు భూమయ్యకు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాంతాపూర్ ఎంపీటీసీ చంద్రకళ నారాయణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రాజా గౌడ్, పూజారి కిషన్, వడ్ల కిష్టయ్య, కర్రోల్ల మైసయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.