హైదరాబాద్: ఆల్వాల్‌లో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలి వద్ద పార్టీ నేతలు తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్‌రెడ్డి కార్యాకర్తలతో కలిసి నిరసనకు దిగారు. జవహర్‌నగర్, బాలాజీనగర్‌లో దుకాణాలను కార్యకర్తలు మూసివేయించారు. దోషులను గుర్తించి పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని తలసాని డిమాండ్ చేశారు.




