Wednesday, 4 November 2026

ధన్బాద్ లో బిఎమ్మెస్ నిరసన ర్యాలీ.. డీజీఎంఎస్ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా

(.ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం మరింత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు గనులలో కార్మికుల రక్షణ, భద్రత నియమాలు మరియు చట్టాలను కఠినంగా అమలు చేయవలసిన డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ అవినీతి మరియు నిర్లక్ష్య ధోరణి వలనతీవ్రమైన ప్రాణాంతక ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో ఉత్పత్తి-ఉత్పాదకత పెరుగుదలపై ఉన్న శ్రద్ధ భద్రతపై లేకపోవటము శోచనీయం. బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద జోషి అనేక సార్లు స్టాండింగ్ కమిటీలో జీరో ఆక్సిడెంట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి జరగాలని, కావలసినంత ఆర్థిక నిధులు కేటాయించినప్పటికిని డీజీఎంఎస్ నిర్లక్ష్యం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులను తప్పించే ప్రయత్నంలో కార్మికులను బలి చేస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని డీజీఎంఎస్ పై తీవ్రస్థాయిలో హెచ్చరించారు.కొంతమంది అవినీతి డీజిఎమ్మెస్ అధికారులు దేశంలోని బొగ్గు గనుల భద్రతా తనిఖీలు నిర్వహించే క్రమంలో కంపెనీలో యాజమాన్యంతో కుమ్మకైపోయి భద్రతా నియమాలు, చట్టాలను ఉల్లంఘలను నిర్లక్ష్య వైఖరితో పట్టించుకోకుండా బొగ్గు గనుల యాజమాన్యంతో అవినీతికి పాలు పడటం వలన కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కావునఈ ఉదాసీనత నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా అఖిల భారతీయ ఖాదన్ మజ్దూర్ సంఘ్-బిఎమ్మెస్ ఆధ్వర్యంలో అన్ని బొగ్గు గనుల జిఎం ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం ధర్నాలు నిర్వహించారు మరియు జార్ఖండ్ రాష్ట్రం డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ముఖ్య కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అవినీతి అధికారులపైన చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఉదృతంగా తనిఖీలు చేపట్టి రక్షణ సూత్రాలకు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠినంగా చర్య తీసుకోవాలని బిఎంఎస్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారీ ర్యాలీ మరియు ధర్నాకార్యక్రమంలో బి ఎం ఎస్ జాతీయ నాయకులు కోల్ సెక్టార్ ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి నాయకత్వంలో బిఎమ్మెస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సురేంద్ర కుమార్ పాండే ఏబికెఎమ్మెస్ అధ్యక్షులు టికేశ్వర్ సింగ్ రాథోడ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే, కార్యదర్శి పి మాధవ నాయక్ సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి టిఎస్ పవన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్, కార్యవర్గ సభ్యులు మరియు అన్ని కంపెనీల బోర్డు సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు….