వీణవంక మార్చి 10 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చిట్టి రెడ్డి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ మడుగురి సమ్మిరెడ్డి వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, వడ్డీతో సహా కలిపి వెంటనే మాఫీ చేయాలని, ధరణి పోర్టల్ తో ఇబ్బంది పడుతున్నారు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రైతులకు 24 గంటల కరెంటు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలని లేకుంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు అనంతరం స్థానిక తహసిల్దార్ రాజయ్య కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, జనరల్ సెక్రటరీ సదానందం, కిషన్ మోర్చా అధికార ప్రతినిధి సురేందర్ రెడ్డి, ఇంద్రారెడ్డి,దేవల్ రెడ్డి, గోవిందరెడ్డి, బాలకృష్ణ, దామోదర్, తోపాటు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




