Thursday, 5 November 2026

వ్యక్తిగత గొడవలు ఎమ్మెల్యే, అతని సోదరునికి ఆపాదించొద్దు – బీఆర్ఆర్ కార్యకర్తలు

 

జనంసాక్షి, ప్రతినిధి : జిల్లాలోని టేక్మాల్ మండల పరిధిలోని పల్వంచ గ్రామ శివారుల్లో ఓ భూ వివాదానికి సంబంధించిన విషయంలో ఆందోల్ – జోగిపేట మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఫైజల్ జోక్యం చేసుకోవడంతో ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసారు. ఫైజల్ పై జరిగిన దాడి ఘటనలో ఎమ్మెల్యే, ఆయన సోదరుడు రాహుల్ కిరణ్ ప్రమేయం ఉందంటూ కొందరు ఇదే పనిగా ప్రసార మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఆయన తమ్ముడు రాహుల్ కిరణ్ కు ఈ దాడి ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు తమ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరిస్తునారు. కొందరు ఎమ్మెల్యే పేరును, ఆయన తమ్ముడి పేరును వాడుకుంటూ భూ దందాలు కొనసాగిస్తూ ఎమ్మెల్యేను అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారాని ఆరోపిస్తున్నారు. భూ సెటిల్ మెంట్స్ చేసేవారు తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నడుచుకోవాలని హితువు పలికారు.

అసలు ఈ పల్వంచ భూవివాదం అంతా ఫైజల్ వ్యక్తిగతం. ఈ భూ వివాదానికి ప్రధాన సూత్రధారి పులి సత్యం అని ఆరోపించారు. పల్వంచ శివారులో 1 ఎకరం 10 గుంటల భూమి ఓ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళ పేరుపై ఉండేది. ఈమె వ్యవసాయం చెయ్యలేక ఇదే గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. దీనితో మల్లేశం గత ఇరవై సంవత్సరాలుగా ఇదే భూమిలో కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. తన అవసరాల కోసం మహిళ తన భూమిని అమ్మలని నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కౌలు రైతు మల్లేశంతో చెప్పడంతో ఆ భూమిని మల్లేశం రెండు సంవత్సరాల క్రితం కొనేందుకు సిద్ధమై కొంత డబ్బును ఆ మహిళకు చెల్లించారు. ఇంతవరకు బాగానే ఉంది. మిగతా డబ్బులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారు. దీంతో ఆ భూమి రిజిస్ట్రేషన్ కాకుండా ఉండేందుకు ఆ మహిళ అధికారులకు దరఖాస్తు చేయడంతో ఆ భూమిని అధికారులు పార్ట్ బిలో పెట్టి హోల్డ్ చేశారు. అస్సలు కథ ఇక్కడే మొదలైంది. ఈ భూమిపై కన్నేసిన పులిసత్యం, ఆ మహిళకు డబ్బు ఆశ చూపి ఆ భూమిని హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించే సందర్భంలో ఎమ్మెల్యేకు తెలియకుండానే ఎమ్మెల్యే పేరును వాడుకొని ఆ భూమి సెటిల్ మెంట్ చేసారాని ఆరోపించారు. ఈ తంతు అంతా కౌలు రైతు మల్లేశంకు తెలియకుండా జరిగిపోవడంతో ఆగ్రహంతో ఆ హైద్రాబాద్ వ్యక్తిని ఆ భూమిలోకి రాకుండా అడ్డుకొని పలుమార్లు గొడవపడ్డారు. ఈ పోరు భరించలేక ఆ హైద్రాబాద్ వ్యక్తి ఓ 8 లక్షల రూపాయలు మల్లేశంకు ఇచ్చి సెట్ చేసుకున్నాడు. సమస్య పరిష్కారం అయ్యింది అనుకునే లోపే మళ్ళీ ఈ భూ వివాదానికి పులిసత్యం తెరలేపాడు. కౌలు రైతు మల్లేశంను పులి సత్యం రెచ్చగొట్టి ఆ హైద్రాబాద్ కు చెందిన వ్యక్తి పై దాడులు చేసేందుకు ప్రోత్సహించారు. ఆ నోటా ఈ నోటా పులిసత్యం ప్రవర్తన వ్యవహారం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్యంను హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే బాగుండదని చెప్పారు. సత్యం ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పులిసత్యంను ఎమ్మెల్యే దూరం ఉంచారు. దింతో సత్యం ఎమ్ చెయ్యాలో తోచక ఫైజల్ స్నేహం చేసి డబ్బులు ఆశలు చూపి భూమి సెటిల్ మెంట్ కు తెరలేపారు. హైద్రాబాద్ వ్యక్తిని ఒప్పించి ఆ భూమిని ఫైజల్ పేరుపై అగ్రిమెంట్ చేశారు. సత్యం, ఫైజల్ మధ్య బేదాభిప్రాయాల రావడంతో… సత్యం కౌలు రైతు మల్లేశంను, గ్రామంలోని కొందరిని రెచ్చగొట్టి ఆ భూమిలో ఫెన్సింగ్ ను రాళ్లను ధ్వంసం చేయించారు. ఈ సమాచారం ఫైజల్ కు తెలియడంతో భూమి వద్దకు రాగానే ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ గొడవతో రాహుల్ కిరణ్ ఎలాంటి సంబంధం లేకున్న.. ఎమ్మెల్యే దూరం పెట్టాడన్న అక్కసుతో ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు రాహుల్ కిరణ్ ను అప్రతిష్ట పరచాలని గొడవను చిత్రికరించింది పులి సత్యమే అని గ్రామంలో, మండలంలో ఓ టాక్ గా వినిపిస్తోంది.