Saturday, 7 November 2026

ధరణి పోర్ట్ ను వెంటనే రద్దు చెయ్యాలి కౌన్సిలర్

ధరణి పోర్ట్ ను వెంటనే రద్దు చెయ్యాలి కౌన్సిలర్ ఇంతియాజ్ అలంపూరు జనంసాక్షి (నవంబర్ 24) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టు వలన రైతులు అధిక సంఖ్యలో నష్టపోతున్నారని, దీనిని వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ ఇంతియాస్ అన్నారు. అలంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యరంలో మండల కేంద్రంలో తహసీల్దార్ కి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ అనే అనాలోచిత వైఖరి వల్ల రైతులు అధిక సంఖ్యలో నష్టం పోతున్నారు అని, ధరణి పోర్ట్ ని వెంటనే రద్దు చేయాలి అని గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇంతియాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అదేషాల మెరకు మండల కేంద్రం లో ని తహసీల్దార్ వినతి పత్రం అందించడం జరిగిందిఅన్నారు. ఈ ధరణి వలన రైతుల భూ సమస్యలు తీరడం లేదని, ఇది ఒక తప్పులతడకగా మారిందనిఅన్నారు. ప్రభుత్వం వెంటనే ధరణి పోర్టల్ ని రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు సింగవరం నాగభూషణం, మరియు అలంపూరు రైతు సంగం ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి,రైతు సంగం కార్యదర్శి షాఫి, కాంగ్రెస్ సినియర్ నాయకులు ధర్మ రాజు, రఘుప్రసాద్, షబ్బీర్ యల్లన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు నరసింహ, పరుశరాముడు,బుచ్చన్న, బాబు, బిసిసెల్ అధ్యక్షులు దుబ్బ వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.