టేకులపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై భారీ ర్యాలీటేకులపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై భారీ ర్యాలీ* తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన
టేకులపల్లి, నవంబర్ 24( జనం సాక్షి ): టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై,రైతు, భూమి, వ్యవసాయ సమస్యలపై మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనతో ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పిసిసి నాయకులు చీమల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు లక్కినేని సురేందర్ రావు, భూక్య దళ్ సింగ్ నాయక్, ఏలూరు కోటేశ్వరరావు, డాక్టర్ రామచంద్రనాయక్ లు మాట్లాడుతూ పోడు భూముల బాధితులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతుబంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందుకే రైతుల కోసం రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతు కోసం రైతు సంక్షేమం కోసం రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించడం రైతులకు మేలు చేస్తుందని అన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక పథకాలు తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా వందలాదిమంది నిరుపేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోడు భూముల రైతులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతు బంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్న�
టేకులపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు




