హైదరాబాద్ : నిజాం కళాశాల వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బషీర్‌బాగ్‌లోని వసతిగృహం ముందు అన్నం గిన్నెలతో ధర్నా చేపట్టారు. అన్నంలో వంట సోడా కలుపుతుండటంతో తాము అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 20 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. వెంటనే వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




