ఇందిరా పార్క్ దగ్గరి ధర్నా చౌక్ తరలింపు ఆలోచన తమ ప్రభుత్వానిది కాదన్నారు సీఎం కేసీఆర్. స్థానిక వాకర్లు మరికొంతమంది దానిపై కోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. కోర్టు నిర్ణయాన్ని బట్టి ధర్నా చౌక్ మారుస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు కేసీఆర్. “ధర్నా ఎక్కడ చేసినా ఒక్కటే… టీవీలు వచ్చిన తర్వాత మరింత సులభం అయ్యింది. ధర్నా చౌక్ ఎక్కడ ఉంటే నష్టమేంటి? సమస్య తెలిస్తే సరిపోతుంది… దానికి ఎక్కడ ఉంటే ఏంటి” అని మరోసారి రెట్టించి ప్రశ్నించారు.




