ఏప్రిల్ 16న అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం అవుతుందని తెలిపింది. సాయంత్రం 4 గంటలకు శాసనమండలి సమావేశం ఉంటుంది. అంతకు ముందు రోజు ఏప్రిల్ 15న బీఏసీ మీటింగ్ సాయంత్రం 5గంటలకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
బీసీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదించుకునేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుందని మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం తెలిపిన సంగతి తెలిసిందే.:




