ఆదర్శప్రాయంధర్మపరాయణుడు శ్రీ రాముడి జీవితం ఆదర్శప్రాయం* ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ
టేకులపల్లి మార్చి 30 (జనం సాక్షి ) : అన్ని బంధాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చి ధర్మపరాయణుడు అయిన శ్రీ రాముడి జీవితం దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయమని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. గురువారం శ్రీరామ నవమి పర్వదినాన సీతారాముల కళ్యాణ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియ, హర్సింగ్ నాయక్ దంపతులు టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో, బొమ్మనపల్లి శ్రీరామాలయాలను వేకువ జామునే సందర్శించి శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదర్శ దంపతులుగా, ఏకపత్నీ వ్రతుడిగా, ధర్మ పరాయనుడిగా, కోదండ రాముడిగా, జగదాభిరాముడిగా, తండ్రి మాటను జవదాటని కుమారుడిగా, ఆదరాభిమానాలు ఉన్న సోదరుడిగా, ఒక మంచి మిత్రుడిగా, లోక కళ్యాణార్ధం రావణ కుంభకర్ణాది మహా బలియమైన రాక్షసులను సంహరించిన శ్రీ రాముడి జీవితం, పరిపాలనా దక్షత కలిగి అడుగడుగున ఆదర్శప్రాయం అన్నారు. అన్ని బంధాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ మర్యాద పురుషోత్తముడిగా ప్రజలతో కీర్తిని అందుకున్న భగవంతుడు శ్రీరాముడు అన్నారు. శ్రీ సీతారాముల ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని జగదాభిరామున్ని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం కోసం ఎమ్మెల్యే దంపతులు దక్షిణ అయోధ్య అయిన భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి దర్శనానికి తరలి వెళ్లారు.
ధర్మపరాయణుడు శ్రీ రాముడి జీవితం




