బోథ్, మార్చి 31 (జనం సాక్షి) బోథ్ మండలంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బోథ్ మండల కేంద్రంలోని పెద్దర్లగుట్ట హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, కౌఠ(బి) లోగ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో విడీసీ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించబడ్డాయి. ఈ కళ్యాణ వేడుకల్లో వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పుణ్యాహవాచనం, అభిషేకం లతోపాటు కళ్యాణ అత్యంత కనుల పండుగ సాగింది. ఈ సందర్భంగా అయ్యవారిని, అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు బాజా బజంత్రీల నడుమ రామనామ స్మరణల నడుమ ఊరెగించారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు సర్పంచ్ కామా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. బోథ్ లో భారీ రామ విగ్రహాన్ని ఊరెగించగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బోథ్, కౌఠ లలో ఘనంగా సీతారామ కళ్యాణం




