ధర్మపురిలో జగతి ప్లే స్కూల్ ను ప్రారంభోత్సవం చేసిన: రాష్ట్ర మంత్రి..

 

ధర్మపురి( జనం సాక్షి) పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి, సిలిండర్ ఆఫీస్ పక్క వీధిలో నూతన జగతి ప్లే స్కూల్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని మాట్లాడుతూ నూతన విద్య ను అందించేందుకు స్కూల్ కరస్పాండెంట్ కు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ, జడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న,వార్డు కౌన్సిలర్ ఉమా మల్లేశం, తదితర వార్డు కౌన్సిలర్లు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు