.
ధర్మపురి(జనం సాక్షి) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పవన్ను ధర్మపురి వేద పండితులు వేదమంత్రాలతో స్వాగతించారు. ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న జనసేనాని.. అనంతరం ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో పవన్ను అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. దర్శనానంతరం అనుష్టుప్ నారసింహ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు.నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు.ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో,ధర్మపురి నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని ఫాలో అయిన పవన్ అభిమానులు
వెల్గటూర్ మం. కిషన్ రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం,యువకుడి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందించారు.




