ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా: బండారి కనకయ్య

ధర్మపురి ( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో ని ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ఆశావాదులు ధరంపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుల సమక్షంలో వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడమే మా లక్ష్యం అంటూ, బుధవారం ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి బండారి కనకయ్య మీడియాతో మాట్లాడుతూ, నేత సామాజిక వర్గం నుండి టికెట్ ఆశిస్తున్నానని, మీడియాతో మాట్లాడుతూ,ఇందిరమ్మ ఇండ్లు పోడు భూములకు అక్క పట్టాలు, సమ్మక-సారక్కకు గిరిజన అభివృద్ధి స్థలాలు ఎస్సీ ఎస్టి ఉప కులాలకు కార్పొరేషన్ ఐ టి డి ఎల్ 3 ఉండగా కొత్తగా ఐదు చేస్తామన్నారు 9 సూపర్ హాస్పిటల్స్ నిర్మిస్తామన్నారు, విద్యార్థులకు 10వ, తరగతి చదివిన విద్యార్థులకు 10,000 స్కాలర్షిప్ 12వ, తరగతి చదివిన విద్యార్థులకు 15000 ఇస్తామన్నారు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు25000 స్కాలర్షిప్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ లక్ష రూ.పీహెచ్డీ విద్యార్థులకు ఐదు లక్షలు స్కాలర్షిప్ చొప్పున ఇస్తామని మీడియా ముఖంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నేతకాని రాష్ట్ర అధ్యక్షుడు రాజమల్లయ్య, నేతకాని మాజీ అధ్యక్షుడు దుర్గం నరసయ్య, జిల్లా అధ్యక్షుడు గంగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.