Tuesday, 3 November 2026

ధర్మపురి పోలీస్ సర్కిల్ పరిధిలో ఆటో ఓనర్స్ డ్రైవర్లకు అవగాహన సదస్సు.

ధర్మపురి ( జనం సాక్షి )ధర్మపురి పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఆయా ఏరియాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు వారి ఆటోల వివరాలను పోలీస్‌స్టేషన్లలో నమోదు చేయించాలని, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఆటో ఓనర్లు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ధర్మపురి ప్రాంతంలో ఆటోలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఆటోలకు చెందిన అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. పలు సంఘటనల్లో ఆటోలు కారణంగా మారుతున్నాయని, కొందరు ఆటోల వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తూన్నాయని, దీంతో అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటలనకు దూరంగా ఉండాలని, అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉంచుకుని ఆటోలు నడపాలని, రోడ్లపై పోలీసులు కనబడితే ఆటోలను దూరంగా ఉంచకుండా, తమ ప్రయాణాలు సాఫీగా సాగించుకోవాలని అన్నారు. ఎస్ఐ దత్తాత్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆటోలకు ట్యాక్సులు రద్దు చేయడంతో పాటు పలు సౌకర్యాలు కల్పించిందని, ఇంతకు ముందు పడిన ఇబ్బందులు ప్రస్తుత పరిస్థితుల్లో లేవని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ఆటోకు చెందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పకుండా పొందాలని, ఆటోలకు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఆర్‌సీ కార్డుతోపాటు, బీమా కూడా చేయించాలన్నారు. ఆటోలు తమకు మాత్రమే కాకుండా అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు కూడా రక్షణగా బీమా పనిచేస్తుందని అన్నారు. ఆటోలు రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నడిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు డ్రైవర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.