Tuesday, 3 November 2026

గ్రామ పంచాయితీ కార్మికుల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 04 మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఉద్యోగ కార్మిక జేఏసీ రాష్ట్ర నాయకులు వడ్డేబోయిన వెంకటేశం ఆధ్వర్యంలో మంగళవారం వాల్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 6 వరకు గ్రామపంచాయతీ కార్మిక ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లనుపరిష్కరించకపోతేసమ్మెచేస్తామని.హెచ్చరించారు.గ్రామ పంచాయతీల సిబ్బందిని పర్మినెట్టు చేస్తూకారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి.51 జీవోను వెంటనే రద్దు పరుస్తూ.మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు పరచాలి. ఎనిమిది.గంటల పని దినాన్ని కల్పిస్తూ .వారాంతపు సెలవులు ఇవ్వాలి.ప్రమాదం జరిగిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషన్ అందించాలని. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సూరారం మధు పోలేపాక రేణుక రాములు ఎల్లంకి స్వామి ఎల్లమయ్య రాజు ఆంజనేయులు లలిత లక్ష్మయ్య మారయ్య ఎల్లమ్మ కార్మికులు పాల్గొన్నారు.