అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగంధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది.
ధర్మపురి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలలో మౌలిక సదుపాయాలు సహా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను భాగస్వామ్యం చేశారు.మంత్రి కొప్పుల ఈశ్వర్ మార్గదర్శనం మేరకుగతంలో ఎన్నడూ లేనివిధంగా ఆధ్యాత్మికవాతావరణం ఉట్టిపడేలా వైభవోపేతంగా వేడుకలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన నేటి నుంచి మార్చి 15 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.ఇప్పటికే ఉత్సవాల నిర్వహణ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.భక్తులకు సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యత నిస్తూ స్వామి వారి దర్శనం భక్తులకు సులభం గా, వేగంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.భక్తులకు, కర్యవ్య నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు సమస్యల సత్వర పరిష్కారానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు.ఉత్సవాలను ఆద్యాంతం నిఘా నేత్రాలతో పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చూసేందుకు పోలీస్ శాఖ నేతృత్వంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. గతం కంటే అధికంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ కార్యాచరణను పోలీస్ శాఖ సిద్ధం చేసింది.కాగా శుక్రవారం సాయంత్రం వరాహతీర్థం, పుట్ట బంగారం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. శనివారం గోధూళి సుముహూర్తాన లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఇప్పటికే ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇలా..శుక్రవారం ఉదయం 11గంటలకు యజ్ఞాచార్యుల ఆహ్వానం, వాసుదేవ,పుణ్యాహవచనం, అంకురార్పణ,పుట్ట బంగారం తేవడం మొదలగు కార్యక్రమాలు,మార్చి 4న సాయంత్రం 6 గంటలకు స్వామి వార్ల కల్యాణోత్సవం,మార్చి 5న రాత్రి 7గంటలకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్ల ఊరేగింపు సేవ,మార్చి 6న రాత్రి 7గంటలకుశ్రీవేంకటేశ్వరస్వామివార్ల ఊరేగింపు సేవ,మార్చి 7న మధ్యాహ్నం 3గంటలకు తెప్పోత్సవం, డోలోత్సవం,మార్చి 8న కోనేరులో శ్రీకొత్త(ఉగ్ర) లక్ష్మీనర్సింహస్వామి వారి తెప్సోత్సవం, డోలోత్సవం,మార్చి 9న వ కోనేరులో శ్రీవేంకటేశ్వరస్వామివార్ల తెప్సోత్సవం, డోలోత్సవం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్ల దక్షిణ దిగ్యాత్ర,మార్చి 10న ఉత్తర దిగ్యాత్ర,మార్చి 11న శ్రీవేంకటేశ్వర స్వామివారి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలు, రాత్రి 8గంటలకు దోపోత్సవం,మార్చి 12న పూర్ణాహుతి, 3గంటలకు రథోత్సవం, 7గంటలకు చక్రతీర్థం, శ్రీయోగా లక్ష్మీనర్సింహస్వామి వారి పుష్పయాగం,మార్చి 13న రాత్రి 7గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగం, రాత్రి 9గంటలకు యోగా లక్ష్మీనర్సింహస్వామి వారి ఏకాంతోత్సవం,మార్చి 14న రాత్రి 7గంటలకు శ్రీఉగ్ర నర్సింహస్వామి వారి పుష్పయాగం, రాత్రి 9గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఏకాంతోత్సవం,మార్చి 15న రాత్రి 9గంటలకు శ్రీ ఉగ్రనారసింహస్వామి వారి ఏకాంతోత్సవ కార్యక్రమాలు ఉంటాయి.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నేటి నుంచే




