Friday, 6 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ

 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్
కొండమల్లేపల్లి నవంబర్ 14 జనం సాక్షి న్యూస్ :
రైతులకు తగిన కనీస సౌకర్యాలు నీళ్లు,నీడ ఉండేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల ను నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన చిన్న అడిషర్ల పల్లి లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్బంగా రఘునందన్ మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి స్వేదం లెక్క చేయక, సేద్యం చేసిన అన్న దాత కు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మా పరిస్థితి దైన్యం అన్న భావన రాకూడదు అని సుస్పష్టం చేశారు. అంతే గాక రైతుల వివరాలు, వారి ధాన్యం కొనుగోళ్ళను ఎప్పటి కప్పుడు తత్సంభందిత నెట్ వర్క్ లో పొందుపరచాలనీ సూచించారు. రైతుల్లో ఆగమ్య గోచర గందర గోళ పరిస్థితి ఉండకుండా పీ పీ సీ ల నిర్వాహకులు అప్రమత్తం గా ఉండాలి అని నిర్దేశించారు.