19న కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు ధర్నా
— టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, నవంబర్ 14( జనం సాక్షి ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ ముందు జరిగే నిరసన ధర్నాను ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. సోమవారం కోయగూడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.అమర్ సింగ్ చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జి.హరిలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని,దానివలన పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం కష్టంగా ఉన్నదని అన్నారు. బదిలీలు పదోన్నతులు చేపట్టాలని,స్పెషల్ టిఆర్టి నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని,కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు అన్నీ పోస్టులు మంజూరు చేయాలని,వివిధ కారణాలతో తొలగించిన సి.ఆర్.టి లను విధులలోకి తీసుకొని 30% ఫిట్మెంట్ పెంచి 12 నెలల జీతాలు ఇచ్చి వారిని రెగ్యులర్ చేయాలని,స్పౌజ్ ఉపాధ్యాయులను ఒకే జిల్లాకు పంపాలని,పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ పాఠశాలల స్కేలు ఇవ్వాలని,ఉపాధ్యాయులకు గ్రేడ్ వన్ హెచ్.డబ్ల్యు.ఓ,ఏ.టి.డి.ఓ,డి.టి.డి.ఓ,డి.డి పోస్టుల ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని,ఖాళీ ఏ.టీ.డీ.వో పోస్టులలో ఎఫ్ఎసి ఏ.టీ.డీ.వోలుగా సీనియర్ హెచ్.ఎం లను నియమించాలని,పి.ఎం.ఆర్సి లలో రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని,పాఠశాలలకు రిపేర్ గ్రాంట్లు ఇవ్వాలని, విద్�




